దిశా సాలియన్ కేసు.. CBI దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశం

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తండ్రి సతీష్ సాలియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. బుధవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం, సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సతీష్ సాలియన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థకు తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నేరస్తులుగా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్