అపచారం.. సీతమ్మకు తాళి కట్టిన ఆలూరు ఎమ్మెల్యే (వీడియో)

AP: కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత విరుపాక్షి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించి, ఏకంగా సీతమ్మ వారికే తాళికట్టారు. చిప్పగిరిలో సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే వీరూపాక్షి సీతమ్మవారికి స్వయంగా తాళికట్టారు. ఈ తథంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. అయితే, పండితులు కట్టమంటేనే తాను తాళిబొట్టు కట్టినట్లు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్