తిరుమలలో అపచారం.. మెట్ల మార్గంలో మాంసాహార భోజనం (వీడియో)

AP: తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమలలో మద్యం, మాంసంపై నిషేధం ఉంది. అయినా కొందరు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు. రూల్స్ పాటించే వారికేనని.. తమకు కాదంటూ కొందరు బరితెగిస్తున్నారు. తరచూ మాంసం తింటూ.. మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటూ పట్టుబడ్డారు. టీటీడీ సిబ్బందే మాంసం తినడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్