భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, తన సిబ్బందితో కలిసి జూలై 8న ఏపీలోని పురుషోత్తపట్నంలో ఆలయ భూములపై అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ గ్రామస్తులతో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా పెరిగి పెద్దగా కావడంతో.. గ్రామస్తులు కర్రలు, చీపుర్లతో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె స్పృహ కోల్పోయారు. ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కూడా గాయపడ్డారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.