ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో వివాదం.. విద్యార్థి దారుణ హత్య

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో జరిగిన వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆ యువతి ప్రియుడు, మరికొందరు కలిసి సదరు యువకుడిని కిడ్నాప్‌ చేసి అతడిని కొట్టి చంపారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆరా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల సన్నీ కుమార్ సింగ్ శుక్రవారం ఉదయం స్నేహితుడితో కలిసి కోచింగ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ఆ విద్యార్థిని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి.. అనంతరం గొంతునొక్కి హత్య చేశారు. ఇన్‌స్టాలో అమ్మాయితో జరిగిన వివాదమే అతడి హత్యకు కారణమని పోలీస్‌ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్