ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనిపై యూజర్లు ఎక్స్‌ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. తమకెదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌ చేస్తున్నారు. కొందరు అప్పుడే మీమ్స్‌ మొదలు పెట్టేశారు. కొందరికి మాత్రమే ఇటువంటి సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యం స్పందించలేదు.

సంబంధిత పోస్ట్