రైతులకు సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్‌ల పంపిణీ: మంత్రి తుమ్మల

TG: ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ డ్రోన్‌లు సబ్సిడీపై అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు 2025-26 సంవత్సరానికి సబ్ ​మిషన్​ అగ్రికల్చర్​ మెకనైజేషన్​(SMAM) పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు అందజేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 చొప్పున ఈ డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో అందచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్