తెలంగాణలో ప్రతి పేదవాడికి సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. LB స్టేడియంలో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ క్రిస్మస్. పేదలకు విద్య, వైద్యాన్ని క్రైస్తవ మిషనరీలు అందిస్తున్నాయి. ఇంకో మతాన్ని కించపరచకుండా ఎవరైనా మతప్రచారం చేసుకోవచ్చు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం' అని వ్యాఖ్యానించారు.