రేపటి నుంచే ఇందిరమ్మ చీరల పంపిణీ

TG: కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం(నవంబర్ 19) ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఈ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని CM అధికారులకు సూచించారు. రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్