ఈ నెల 10 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి

TG: మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఏటా 20 వేల కోట్లకు తగ్గకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 10 నుంచి 16 వరకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను వారికి పంపిణీ చేస్తామన్నారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. RTCకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు తొలి నెల అద్దె కింద రూ.1.49 కోట్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్