నెలాఖరులోగా గ్రామాల్లో చీరల పంపిణీ పూర్తి: సీఎం రేవంత్

TG: ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే చీరల పంపిణీపై కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు, మార్చి నెలలో పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 35 లక్షల చీరలను అందిచాలని సూచించారు. కోటి మందికి కోటి చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నామని.. ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదే అన్నారు.

సంబంధిత పోస్ట్