గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులో అపశృతి

TG: చాదర్‌ఘాట్‌ వద్ద గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. లారీ నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. 26వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటలకు గణేశ్​ విగ్రహాన్నిఊరేగింపుగా తీసుకువెళ్తున్న సమయంలో చాదర్‌ఘాట్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఘటన జరిగింది. లారీ పైనుంచి ప్రమాదవశాత్తు దీపక్​ కిందపడగా, లారీ వెనక టైర్ అతని తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕