పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ 52 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. ఐర్లాండ్, ఆస్ట్రేలియా నేపథ్యమున్న ఫైనాన్షియర్ కామెరూన్ ఓ రీల్లీని ఆమె వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. సినిమాలు, డాక్యుమెంటరీలపై ఉన్న ఆసక్తితో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు సమాచారం. 1995లో ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న జెమీమా.. 2004లో ఆయన నుంచి విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇమ్రాన్ జైలు నుంచి విడుదల కావాలని జెమీమా గతంలో పాక్ ప్రభుత్వాన్ని కోరారు.