భర్తతో విడాకులు.. చిన్నారిని హింసించిన కన్నతల్లి (వీడియో)

TG: కన్నతల్లే చిన్నారిపై కర్కశంగా వ్యవహరించింది. HYD మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేట్‌కు చెందిన తాజుద్దీన్, షబా నజ్వీమ్ దంపతులకు ఓ చిన్నారి. భార్యాభర్తల విడాకుల కారణంగా చిన్నారి ప్రస్తుతం తల్లి వద్దే ఉంటుంది. 2 నెలల క్రితం జోగిపేట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ జావేద్‌ను రెండో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి చిన్నారిని హింసిస్తోంది. చిన్నారి ఒంటిపై పలు చోట్ల వాతలు, గోళ్లు కత్తిరించి వాటిలో కారం పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నజ్వీమ్, జావేద్‌లను అరెస్ట్ చేసి, చిన్నారిని శిశు సంరక్షణకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్