భారత్‌లో దీపావళి సందర్భంగా ఆకాశాన్ని ప్రకాశవంతం చేసిన పటాకులు పొరుగు దేశం పాకిస్థాన్‌లో కలవరం రేపాయి. భారత సరిహద్దు నుంచి వ్యాపించిన పొగ, కాలుష్య కణాలతో లాహోర్ వాయు నాణ్యత సూచీ (AQI) 266కి చేరి, ప్రమాద స్థాయికి పడిపోయింది. ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ తర్వాత లాహోర్ రెండో స్థానంలో నిలిచింది. కొందరు దీన్ని సరిహద్దు పర్యావరణ సంక్షోభం అని, మరికొందరు భారత్ దీపావళి వేడుకలతో పాకిస్థాన్‌ను హడలెత్తించిందని అంటున్నారు.