కర్ణాటక అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్ లిజిస్లేచర్ పార్టీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఎమ్మెల్యేల మద్దతుతో ఈ ఎన్నిక జరిగింది. పార్టీ కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగిన ఈ ప్రకటనను పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేశారు. దీంతో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది.