సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు: డీకే శివకుమార్

కర్ణాటకలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో, డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2004లో యూపీఏ విజయం సాధించిన తర్వాత సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని, అప్పట్లో అబ్దుల్ కలాం కూడా ఆమె ప్రధాని కావాలని కోరుకున్నారని శివకుమార్ అన్నారు. సోనియా గాంధీ అధికారాన్ని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారని తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్