డీఎంకే మేనిఫెస్టో: మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు స్టాలిన్ వరాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించేందుకు సీఎం స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా కీలక వాగ్దానాలు చేశారు. 1.37 కోట్ల మంది మహిళలకు ప్రతినెల అందిస్తున్న సాయాన్ని రూ.2 వేలకు పెంచుతామని, బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి విద్యార్థులకు వర్తింపజేస్తామని, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలకు పెంచుతామని తెలిపారు. ఇంటి వస్తువుల కొనుగోలుకు రూ.8 వేల కూపన్లు, వెయ్యి సంరక్షణ కేంద్రాలు, యువతకు ఉచిత పవర్ లింక్డ్ పంపుసెట్లు, నియో టైడల్ పార్క్ ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్