తమిళనాడు మనచనల్లూరు డీఎంకే ఎమ్మెల్యే కతిరవన్ తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా హెలికాప్టర్‌ను గిఫ్టుగా ఇవ్వడం చర్చనీయాంశమైంది. రూ.40 కోట్లతో దాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన తండ్రి శ్రీనివాసన్ హెలికాప్టర్‌లో వెళ్తున్న వీడియోను కతిరవన్ షేర్ చేశారు. అయితే కిడ్నీ రాకెట్ కేసులో వీరికి చెందిన ధనలక్ష్మి శ్రీనివాసన్ హాస్పిటల్ పేరు రావడంతో గతంలో దుమారం రేపింది. ఈ పరిస్థితుల్లో ఆయన హెలికాప్టర్ బహుమతిగా ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.