తమిళనాడులో మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా చేశారు. దీంతో ఇప్పటివరకు రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. టీవీకేలో చేరుతున్న ఈ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.