తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార DMK ట్రెండ్స్లో వెనుకబడుతోందన్న సమాచారం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. ప్రాథమిక లెక్కింపుల్లో పార్టీ ఆధిక్యం తగ్గి మూడో స్థానానికి పడిపోతున్నట్టు కనిపించడంతో చెన్నైలోని DMK ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లను కార్యకర్తలు తొలగిస్తూ, బోరున విలపిస్తూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా, కౌంటింగ్ కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.
VIDEO CREDIT: ANI