బోరుబావుల కింద వరి సాగు చేయొద్దు: మంత్రి తుమ్మల

TG: ఎల్‌నినో తీవ్రత ఇంకా పెరిగే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఇంకా పడిపోయే ప్రమాదముందని, బోరుబావుల కింద వరి సాగు చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నీళ్లు, కరెంట్‌ బాగానే ఉన్నాయని భావించి వరి వేయొద్దని సూచించారు. యాసంగి పంటకు నీళ్లు, విద్యుత్‌ కొరత పెరిగే ప్రమాదముందన్నారు. ఈసారి ప్రాజెక్టుల్లో నీళ్లు లేనందున సాగుకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕