TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనకు రెగ్యూలర్ బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. డబ్బు, పలుకుబడి ఉన్న అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. పీఎస్‌లోనూ విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని, ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ విచారణకు సహకరించకపోవచ్చని తెలిపారు.