కోల్డ్రిఫ్ సిరప్ వాడొద్దు: డీసీఏ హెచ్చరిక

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అనుమానిత కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ 13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించారని వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్ (బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్13) విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్‌తో కలుషితమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్