శ్రీకృష్ణుడు, సత్యభామలు నరకాసురుడిని సంహరించిన నరకచతుర్దశి, రామయ్య అయోధ్యకు తిరిగి వచ్చిన దీపావళి పండుగలు ఈసారి ఒకే రోజు రావడం విశేషం. ఉదయం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించాలి. అనంతరం శ్రీకృష్ణ-సత్యభామలను పూజిస్తే విజయం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే సాయంత్రం వేళ దీపాలను వెలిగించి, గణపతిని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సమస్త విఘ్నాలు తొలగిపోతాయని వారు పేర్కొంటున్నారు.