వేసవిలో అరటిపండ్లు త్వరగా కుళ్లిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి !

వేసవిలో అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోకుండా ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలను పాటించాలి. ఇతర పండ్ల నుంచి అరటి గెలలను దూరంగా ఉంచాలి. గెల కాడలను ప్లాస్టిక్ కవర్‌తో కప్పడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. నేలపై పడుకోబెట్టకుండా వేలాడదీయడం, చల్లని, నీడ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయడం వంటివి చేయాలి. పండిన తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

సంబంధిత పోస్ట్