రాత్రి వేళల్లో మద్యం ఎక్కువగా తాగడం వల్ల నిద్ర దెబ్బతినడమే కాకుండా, గుండె, లివర్ వంటి ముఖ్య అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలా మంది మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని అనుకుంటారు, కానీ వాస్తవానికి అది గాఢ నిద్రను దూరం చేసి, అర్ధరాత్రి తరచూ మెలకువ వచ్చేలా చేస్తుంది. మద్యం వల్ల గొంతులోని కండరాలు రిలాక్స్ అయ్యి, గురక పెరుగుతుంది. ఇది శ్వాస తాత్కాలికంగా ఆగిపోయే 'స్లీప్ అప్నియా' సమస్యకు దారితీయవచ్చు. దీనివల్ల రాత్రి పడుకున్నప్పుడు గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయి.