వర్షాకాలం రాగానే సీజనల్ వ్యాధుల బెడద పెరుగుతుంది. జలుబు, వైరల్ జ్వరం, ముక్కు దిబ్బడ, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో సాధారణంగా ఎదురవుతుంటాయి. అయితే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, ఈ రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద మూలిక తరహాలో పనిచేస్తుందని అంటున్నారు. రాగి పాత్రలో తాగితే..నీటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోతుందట. నీళ్లు బాగా శుభ్రంగా ఉంటాయని సూచిస్తున్నారు.