చికెన్ తింటున్నారా?

AP: రాష్ట్రంలో మళ్లీ బర్డ్‌ఫ్లూ పంజా విసిరింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా సిద్దరాంపురంలోని ఓ ఫారంలో 2,500 కోళ్లు మృత్యవాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయినట్టు సంబంధిత అధికారులు  నిర్ధారించుకున్నారు. అనంతరం ఆ గ్రామంలో బర్డ్‌ఫ్లూ‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. చికెన్‌ను తినాలనుకుంటే 75 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో బాగా ఉడికించుకుని తినాలని, ఎవరిలోనైనా శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕