చాలా మందికి రాత్రి భోజనం చేసిన తర్వాత ఐస్‌క్రీమ్ తినడం అలవాటు. అలాంటి వారిలో జీర్ణక్రియ మందగించి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌క్రీములో ఉండే అధిక చక్కెర, కొవ్వు వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చల్లదనం వల్ల కొందరికి జలుబు, గొంతు నొప్పి రావచ్చు. కాబట్టి రాత్రిపూట దీనికి దూరంగా ఉండటం మంచిది.