పిల్లలకు ఖాళీ కడుపుతో పాలు ఇస్తున్నారా?

చాలామంది తల్లిదండ్రులు ఉదయాన్నే పిల్లలకు ఖాళీ కడుపుతో పాలు ఇస్తుంటారు. అయితే పాలలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని బలహీనపరిచి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లలు రోజంతా నీరసంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇడ్లీ, దోశ, ఉప్మా లేదా పండ్లు వంటి అల్పాహారం తినిపించిన తర్వాతే పాలు ఇవ్వడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్