పూర్వం రాజులు రాజ్యాలను గెలవడానికి లేదా పోటీలలో గెలవడానికి యుద్ధాలు చేసేవారు. అయితే, అన్ని సందర్భాల్లోనూ యుద్ధం అవసరం ఉండేది కాదు. యుద్ధం జరిగితే అపారమైన ప్రాణనష్టం సంభవించేది. దీన్ని నివారించడానికి కొన్నిసార్లు మనుషులతో యుద్ధానికి బదులుగా, ఇరుపక్షాలవారు రెండు కోళ్లను పందెం కాసేవారు. ఏ కోడి గెలిస్తే ఆ పక్షం గెలిచినట్లుగా భావించేవారు. ఈ కోడిపందేలు ప్రాణనష్టాన్ని నివారించడానికి అప్పట్లో ఎంచుకున్న ఒక మార్గమని చెప్పవచ్చు.