అల్లం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కావునా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల్ని తొలగిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి. కానీ అల్లం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల డయేరియా మరియు లూజ్ మోషన్‌లకు దారి తీస్తుంది.