క్రికెట్‌లో ఎన్ని రకాల డకౌట్‌లుంటాయో తెలుసా?

క్రికెట్‌లో బ్యాటర్లు సున్నా పరుగులతో ఔటవడాన్ని డకౌట్ అంటారు. అయితే డకౌట్లలోనూ అనేక రకాలున్నాయి. బ్యాటర్ ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటైతే గోల్డెన్ డక్, రెండో బంతికే అయితే సిల్వర్ డక్, మూడో బంతికే అయితే బ్రాంజ్ డక్ అంటారు. అసలు బంతిని ఎదుర్కోకుండానే రనౌట్ లేదా టైమ్డ్ అవుట్ అయితే డైమండ్ డక్ అవుతుంది. ఓపెనర్ మొదటి బంతికే ఔటైతే రాయల్ డక్, చివరి బంతికే అయితే లాఫింగ్ డక్ అంటారు. జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బంతిని ఎదుర్కోకుండా ఔటైతే టైటానియం డక్, కొత్త సీజన్ మొదటి మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైతే గోల్డెన్ గూస్ డక్ అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్