సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా?

TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులలో కొందరు డిసెంబరు 3న మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ గడువు ముగిసిన వెంటనే.. పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. తెలుగు అక్షర క్రమం ఆధారంగా ఈ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు ఉండనుంది. అభ్యర్థులు నామినేషన్ వేసిన డాక్యుమెంట్‌లో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తుల కేటాయింపు జరుగుతుంది.

సంబంధిత పోస్ట్