ఫోన్‌లు చూస్తూ పిల్లలు భోజనం చేస్తే వారి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ చూస్తూ తిన్నప్పుడు వారు అతిగా తింటారు లేదా తక్కువగా తింటారు. అతిగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. తక్కువ తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అవసరానికి తగినట్లు తినకపోతే అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఫలితంగా శరీరం పోషకాహార లోపానికి గురవుతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.