తాటి కల్లు ఎలా తయారవుతుందో తెలుసా?

తాటి కల్లు తయారీ తాటి చెట్టు పూల గుచ్ఛాల నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా వాటికి నూనె రాసి మసాజ్ చేసి, చివరన చిన్న కోత పెడతారు. దాని కింద మట్టి కుండను కట్టి 10–12 గంటల పాటు కారే రసాన్ని సేకరిస్తారు. ఈ తాజా తీపి రసాన్ని ‘నీరా’ అంటారు. గాలిలోని సహజ ఈస్ట్ కారణంగా కిణ్వ ప్రక్రియ జరిగి ఆల్కహాల్ ఏర్పడితే అది ‘కల్లు’గా మారుతుంది. ఉష్ణోగ్రత, వాతావరణం, పరిశుభ్రత ఆధారంగా ఈ మార్పు వేగం ఉంటుంది. ఈ సంప్రదాయ పద్ధతి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕