రాజస్థాన్లోని నాగూర్ జిల్లా బుడాటిలో ఉన్న 200 ఏళ్ల చరిత్ర కలిగిన 'చతుర్ దాస్ జీ మహారాజ్' మందిరం పక్షవాతం (పెరాలసిస్) వ్యాధిని నయం చేస్తుందని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చే రోగులు 7 రోజుల పాటు బస చేసి, సన్యాసి సమాధి చుట్టూ ప్రతిరోజూ 7 ప్రదక్షిణలు చేయడం ద్వారా వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారని సమాచారం. ఆధునిక చికిత్సలకు లొంగని వ్యాధులు కూడా ఇక్కడ నయమవుతాయని, వేలాది మంది భక్తులు తమ ఆరోగ్యం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.