మారుతోన్న జీవనశైలితో ఇప్పుడు చాలామందిలో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (ఐబీఎస్) కనిపోస్తోంది. ఐబీఎస్ అంటే.. కడుపునొప్పి, కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం వంటివి వేధిస్తుంటాయి. దీనిపై మిచిగన్ విశ్వవిద్యాలయం అధ్యయనం నిర్వహించింది. సమతులాహార ప్రణాళిక, మెడిటరేనియన్ డైట్‌తో ఐబీఎస్ లక్షణాలు తగ్గించొచ్చని వెల్లడించింది. సరైన డైట్ తీసుకున్న 82శాతం మందికి ఐబీఎస్ నుంచి ఉపశమనం దొరికిందని అధ్యయనంలో వెల్లడైంది.