బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం. ఇది మెదడులో రక్త ప్రసరణ సమస్య వల్ల సంభవిస్తుంది. మెదడుకు రక్తం సరఫరా ఆగిపోయినా లేదా మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం వల్ల అవి దెబ్బతిని చనిపోతాయి. దీంతో శరీరంలోని కొన్ని భాగాలు పనిచేయకుండా ఆగిపోతాయి. ఈ సమస్య చాలా డేంజర్. దీన్ని ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా మంచిది.