టిబెటన్ బౌద్ధమతంలో స్కై బరియల్ లేదా ఆకాశ సమాధి అనేది ప్రత్యేక అంత్యక్రియల పద్ధతి. ఇందులో మృతదేహాన్ని పర్వతం పైన వదిలి, రాబందులు తినేటట్లు చేస్తారు. ఆత్మ స్వర్గానికి చేరడానికి, పునర్జన్మ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ పద్ధతి మార్గమని అక్కడి వాళ్లు నమ్ముతారు. శరీరాన్ని రాబందులకు అర్పించడం కరుణ అంతిమ చర్యగా భావిస్తారు. టిబెట్‌లో కలప, గట్టి నేల లేకపోవడంతో ఈ పద్ధతి ఆచారమైంది. ఇది టిబెటన్ సంస్కృతి, మతంలో ఒక ముఖ్యమైన భాగం.