ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన, జన్యుపరంగా సంక్రమించిన ఆరోగ్య పరిస్థితి. దీని ఫలితంగా జుట్టు, చర్మం, కళ్లలో మెలనిన్ అనేది లోపిస్తుంది. అసలు పిగ్మెంటేషన్ లేకపోవడం వలన వీరి శరీరమంతా తెల్లటి రంగులో కనిపిస్తుంది. వీరికి ప్రకాశవంతమైన సూర్యకాంతిని చూస్తే తట్టుకోలేరు. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ పరిస్థితి పుట్టుకతో వచ్చే జన్యు సంబంధితమైనది.. అంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుంది.