మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. మినప్పప్పు రక్తపోటు, డయాబెటిస్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, దీన్ని మితంగా తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.