ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు "ఆపరేషన్ కగార్" చేపట్టాయి. "కగార్" అంటే తెలుగులో అంతం లేదా చివర అని అర్థం. గత ఐదు నెలలుగా దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు భారీగా నష్టపోతున్నారు. ప్రతి ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పైచేయి సాధిస్తున్నారు.