సంతార అంటే ఏమిటో తెలుసా..?

జైన మతంలో సంతార/సల్లేఖన దీక్ష అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఆహారం, నీరు వంటివి తీసుకోకుండా ఉపవాసం ఉండి స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేయడాన్నే సల్లేఖన దీక్ష అంటారు. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యం ఉన్నవారు మత గురువు వద్ద ఈ దీక్ష తీసుకుంటారు. ఈ దీక్షలో ఆహార, పానీయాలను పూర్తిగా మానేస్తారు. సంతార ద్వారా వచ్చే మరణాన్ని సమాధి మరణం లేదా శాంతియుత మరణం అంటారు. జైన సన్యాసులు ఎక్కువగా ఈ వ్రతాన్ని చేపట్టి ప్రాణాలను త్యజిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్