సుంకం అంటే ఒక దేశం నుండి ఇతర దేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రభుత్వం విధించే పన్ను. ఈ సుంకాలను "పరస్పర సుంకాలు" (Reciprocal Tariffs) అని పిలుస్తారు. అంటే భారత్ అమెరికా వస్తువులపై ఎంత సుంకం విధిస్తుందో.. అమెరికా కూడా భారత వస్తువులపై అంతే సుంకం విధిస్తుందని అర్థం. కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 25-27% సుంకాలు విధించిన విషయం తెలిసిందే.