ప్లాస్టిక్ సర్జరీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. క్షతగాత్రుల గాయాలు మాన్పడానికి సాయపడిన ఈ శస్త్రచికిత్స నేడు అన్ని వైద్య విభాగాలకూ విస్తరించింది. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న శరీర భాగాలకు పూర్వరూపం ఇవ్వడానికి ప్లాస్టిక్ సర్జరీనే మార్గం. నోటి క్యాన్సర్ బారిన పడిన రోగి ముఖభాగంలోని దవడ, చెంపలు తదితర భాగాలను తొలగించినప్పుడు ముఖాకృతిని గతంలో ఉన్నట్టు తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ సర్జరీయే దిక్కు.