గాంధీజీకి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

జాతిపిత మహాత్మా గాంధీకి కర్ణాటకలో ఓ ఆలయం ఉంది. మంగళూరు జిల్లాలోని కంకనాడి గ్రామస్థులు గాంధీజీని దైవంగా కొలుస్తున్నారు. 1948లో ఆయన హత్య అనంతరం అదే ఏడాది డిసెంబరు 15న శ్రీ బ్రహ్మ బైదర్కల ఆలయ ప్రాంగణంలో గాంధీజీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. 2011లో మట్టి విగ్రహం స్థానంలో తెల్లటి మార్బుల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕