వారణాసి గ్లింప్స్‌లో కనిపించే ఛిన్నమస్తా దేవి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి సినిమాలో కనిపించే ఛిన్నమస్తా దేవి ఆలయం ఝార్ఖండ్‌లోని రామగఢ్ జిల్లా, రాజ్రప్పలో ఉంది. దామోదర్, భైరవి నదుల సంగమ ప్రదేశంలో ఉన్న ఈ ఆలయాన్ని శక్తిపీఠాలలో ఒకటిగా భావిస్తారు. పురాణాల ప్రకారం, పార్వతీదేవి తన స్నేహితురాళ్ళ ఆకలి తీర్చడానికి తన తలను తానే నరుక్కున్నట్లుగా ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తుంది. ఇది అహంకారాన్ని వదిలి, దేవుడితో ఏకం కావాలని సూచిస్తుంది. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని, శత్రువుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. తాంత్రిక సాధన చేసేవారికి ఇది పవిత్ర స్థలం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్