ప్రతి ఏటా పెరుగుతున్న శివలింగం.. ఎక్కడో తెలుసా?

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా కలానౌర్‌లో ఉన్న శయన శివాలయం, భూమికి అడ్డంగా ఉన్న శివలింగంతో ప్రత్యేకతను సంతరించుకుంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో సైనిక శిబిరం ఉన్నప్పుడు, గుర్రాలు కుంటుపడటంతో అక్కడ తవ్వగా ఓ నల్లటి శివలింగం బయటపడిందని చరిత్ర చెబుతోంది. శివలింగాన్ని తొలగించే ప్రయత్నంలో రక్తం స్రవించిందని, అప్పుడు అశరీరవాణి వినిపించిందని, దానితో అక్బర్ ఆలయాన్ని నిర్మించాడని స్థానిక కథనం. ఇక్కడి శివలింగం ప్రతి ఏటా క్రమక్రమంగా కొంత పరిమాణంలో పెరుగుతుందని భక్తుల నమ్మకం. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్